Sunday, May 5, 2024

దూసుకుపోతోన్న ‘డీజే టిల్లు’ – క‌లెక్ష‌న్ల సునామీ మామూలుగా లేదు

బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది డీజే టిల్లు చిత్రం. ఈ చిత్రంలో హీరోగా సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ న‌టించాడు. విమ‌ల్ కృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఇక సితార ఎంట‌ర్టైన‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించాడు. మొద‌టి నుంచే ఈ చిత్రం పై మంచి బ‌జ్ ఉంది. ఇప్ప‌టికే మేక‌ర్స్ విడుద‌ల‌చేసిన ట్రైల‌ర్, టైటిల్ సాంగ్ సినిమాపైన భారీ అంచ‌నాలు పెంచాయి. ముఖ్యంగా యూత్‌లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. దానికి త‌గ్గ‌ట్టే ప్రీ బుకింగ్స్ ఓ రేంజ్‌లో జ‌రిగాయి. శ‌నివారం విడుద‌లైన ఈ చిత్రం మొద‌టి షో నుంచే పాజిటీవ్ టాక్ తెచ్చుకొని భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. పోటీగా ఖిలాడీ, సెహారి, ఎఫ్ఐఆర్ వంటి సినిమాలున్న యూత్ డిజే టిల్లుకు ఓటేస్తున్నారు. టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్ : 4.33 కోట్లు (8.10కోట్ల గ్రాస్) డిజే టిల్లు ప్రి రిలీజ్ బిజినెస్ 8.95 కోట్లు బిజినెస్ జ‌ర‌గ‌గా 9.5 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం మొద‌టిరోజు 4.33 కోట్ల షేర్‌ను వ‌సూళు చేసింది. ఈ చిత్రం క్లీన్ హ‌ట్ అవ్వాలంటే మ‌రో 5.17 కోట్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. సెల‌వు దిన‌మ‌యిన ఆదివారం కూడా ఈ చిత్రం ప్రీ బుకింగ్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయిట‌. మ‌రి ఇంకా క‌లెక్ష‌న్స్ పెరిగే ఛాన్స్ ఉంది కాబ‌ట్టి..డిజే టిల్లు పంట పండిన‌ట్టే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement