Friday, April 26, 2024

Maharashtra Updates: క్యాంపులు మారుస్తున్న షిండే.. సుప్రీంకు వెళ్లనున్న ఉద్ధవ్​.. రేపు బలపరీక్ష ఉండేనా?

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో కొత్త కొత్త ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. దీంట్లో బీజేపీ పెద్దల హస్తం ఉందన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఇప్పటికే పలువురు బీజేపీ లీడర్లు కలిసి మంతనాలు జరిపిన్టు స్పష్టం అవుతోంది. కాగా, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని సేన-ఎన్‌సిపి-కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లోర్ టెస్ట్ కోసం తాను గురువారం ముంబైకి చేరుకుంటానని శివసేన రెబెల్ లీడర్​ ఏక్‌నాథ్ షిండే బుధవారం తెలిపారు. అయితే ఫ్లోర్ టెస్ట్ తేదీని జూన్ 30గా పేర్కొంటూ గవర్నర్ రాసిన లేఖ నిన్న వైరల్ అయ్యింది.

కాగా, షిండే గౌహతిలో విలేకరులతో మాట్లాడుతూ.. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల బృందం వారం నుండి క్యాంప్‌లో ఉందన్నారు. తన గ్రూపు శాసనసభ్యులందరితో కలిసి తాను ముంబైకి చేరుకుంటానని చెప్పారు. గత రాత్రి, ప్రతిపక్ష బిజెపి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకునేలా సంక్షోభంలో ఉన్న మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. అదే సమయంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తిరుగుబాటు ఎమ్మెల్యేలను కలిసేందుకు తాజా ప్రయత్నం చేశారు. ఇప్పుడు వారంతా   గౌహతిలో విడిది చేశారు.

ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ప్రభుత్వం బలపరీక్ష కోసం గవర్నర్ లేఖపై సుప్రీంకోర్టును కదిలించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర పాలక మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ లేఖపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు. గురువారం ఉదయం 11 గంటలకు శివసేన నేతృత్వంలోని ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించాలని మహారాష్ట్ర శాసనసభ కార్యదర్శిని గవర్నర్ కోష్యారీ కోరారు. ఈ కేసుపై సుప్రీంకోర్టు జులై 11 వరకు యథాతథ స్థితిని కొనసాగించిందని చెప్పారు. కానీ, గవర్నర్​ 30వ తేదీన బలపరీక్ష కోరడం కరెక్ట్​ కాదన్నారు.

ఇక.. షిండే శిబిరం గౌహతి నుండి గోవాకు మకాం మార్చడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏక్​నాథ్ షిండే క్యాంపు ఎమ్మెల్యేలు రేపటికి ఫ్లోర్ టెస్ట్ హాజరయ్యేందుకు ప్లాన్​ చేస్తున్నారు. మొదట గుజరాత్‌లో మకాం వేసి, అక్కడి నుంచి అస్సాంకు వెళ్లిన ఎమ్మెల్యేలు, బీజేపీ పాలిత రాష్ట్రమైన గోవాలోని తాజ్ కన్వెన్షన్ హోటల్‌లో 71 గదులను బుక్ చేసినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement