Thursday, April 25, 2024

నిలకడగా పసిడి ధర, తగ్గిన వెండి ధరలు

బంగారం ధర శాంతించింది. నిన్న పెరిగిన పసిడి రేట్లు ఈరోజు మాత్రం నిలకడగానే కొనసాగాయి. జూన్ 29న బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 47,650 వద్దనే ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. రూ. 51,980 వద్ద కొనసాగుతోంది.

నిన్న బంగారం ధరలు రూ. 100కు పైగా పెరిగిన విషయం తెలిసిందే. మరోవైపు సిల్వర్ రేటు మాత్రం పడిపోయింది. ఈరోజు వెండి రేటు రూ. 400 దిగివచ్చింది. దీంతో వెండి ధర కేజీకి రూ. 65,600కు పడిపోయింది. కాగా సిల్వర్ రేటు నిన్న రూ. 300 వరకు పెరుగులు పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement