Tuesday, November 12, 2024

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కొత్తగా 14,506 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,34,33,345కు పెరిగాయి. ఇందులో 4,28,08,666 మంది బాధితులు కోలుకోగా, 5,25,077 మంది కరోనాకు బలయ్యారు. అయితే గత కొన్ని రోజులుగా రోజువారీ పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతుండటంతో యాక్టివ్‌ కేసులు లక్షకు చేరువయ్యాయి. ప్రస్తుతం 99,602 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

గత 24 గంటల్లో 30 మంది మృతిచెందారని, 11,574 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.38 శాతానికి పెరిగిందని పేర్కొన్నది. మొత్తం కేసుల్లో 0.23 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.56 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 197.46 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. ఇందులో మంగళవారం ఒకేరోజు 13,44,788 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement