Monday, May 6, 2024

ఇంధన ధరల పెంపు ఎఫెక్ట్.. 15శాతం చార్జీలు పెంచిన ఉబర్..

రోజూ పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావాన్ని తగ్గించడానికి యాప్ ఆధారిత టాక్సీ సర్వీస్ చర్యలు చేపట్టింది. తొలుత ముంబైలో చార్జీలను 15 శాతం పెంచుతున్నట్టు ఉబర్ సర్వీస్ ప్రకటించింది. దీంతో డ్రైవర్ పార్టనర్లకు కాస్త ఊరట లభించనున్నట్టు పేర్కొంది. ఉబర్ ముంబైలో ప్రయాణ చార్జీలను 15 శాతం పెంచుతున్నట్లు ఉబెర్ ఇండియా, దక్షిణాసియా సెంట్రల్ ఆపరేషన్స్ హెడ్ నితీష్ భూషణ్ ఇవ్వాల (సోమవారం) తెలిపారు. ఇంధన ధరల పెంపుతో ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లను ఆదుకునేందుకే ఛార్జీలను పెంచుతున్నట్లు క్యాబ్ అగ్రిగేటర్ పేర్కొంది. మేము డ్రైవర్ల నుండి అభిప్రాయాన్ని తీసుకుంటాం. ప్రస్తుత ఇంధన ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని అర్థం చేసుకున్నామని భూషణ్ తెలిపారు.

ఆన్‌లైన్ టాక్సీ-హెయిలింగ్ సర్వీస్ రాబోయే వారాల్లో ఇంధన ధరల కదలికలను ట్రాక్ చేయడం కొనసాగిస్తుందని, అవసరమైన విధంగా తదుపరి చర్యలు తీసుకుంటుందని భూషణ్ తెలిపారు. ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో క్యాబ్‌లలో ఏసీ ఆన్ చేయడానికి డ్రైవర్లు అదనపు చార్జీలు వసూలు చేయడం ప్రారంభించారని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. AC స్విచ్ ఆఫ్ చేయడం వల్ల తమ క్యాబ్‌ల మైలేజీ లీటరుకు 2-4 కి.మీ మేర మెరుగుపడుతుందని వారు చెప్పారు. ఇలాంటి క్రమంలో ఉబర్ తీసుకున్న నిర్ణయంపై కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తుంటే.. అయినా ఇది చాలా తక్కువని, తమకు గిట్టుబాటు కాదని ఇంకొందరు డ్రైవర్లు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement