Tuesday, May 21, 2024

రాధేశ్యామ్ నుండి ‘నీ రాత‌లే’ సాంగ్ రిలీజ్ – ప్ర‌భాస్, పూజా లుక్క్ అదుర్స్

ల‌వ్ ఎమోష‌న‌ల్ , ల‌వ్ ఎట‌ర్టైన‌ర్ , పీరియాడిక్ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కుతోంది రాధేశ్యామ్ చిత్రం. మార్చి 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది. రాధే శ్యామ్ మూవీ నుండి నేడు ఈ రాతలే సాంగ్ వీడియో విడుదల చేశారు. రెండున్నర నిమిషాల ఈ రాతలే సాంగ్, చాలా రొమాంటిక్ గా సాగింది. ప్రభాస్-పూజా మధ్య లవ్ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుందో ఈ సాంగ్ చూస్తే అర్థమవుతుంది. దర్శకుడు రాధాకృష్ణ వీరిద్దరి లవ్ ట్రాక్ చాలా క్యూట్ అండ్ రొమాంటిక్ గా రాసుకున్నారు. కాగా ప్రభాస్ సూపర్ రొమాంటిక్ గా ఉన్నాడు. పూజా గ్లామర్ మరో ఎత్తు. మొత్తంగా ఈ రాతలే వీడియో సాంగ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ మనసులు దోచేసింది.ఈ రాతలే సాంగ్ ని మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ కంపోజ్ చేశారు. యువన్ శంకర్ రాజా, హరిణి పాడారు. కృష్ణ కాంత్ సాహిత్యం అందించారు సినిమా కోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయలు సాంగ్ లో కనిపిస్తుంది. లొకేషన్స్, సెట్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. ప్రభాస్ హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ లో రాధే శ్యామ్ తెరకెక్కుతుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement