Friday, May 3, 2024

Bharath Jodo: చెరుకు గ‌డ‌లు తింటూ, స‌మ‌స్య‌లు వింటూ.. హుషారుగా సాగుతున్న రాహుల్‌!

భారత్​ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ పాదయాత్ర ఇవ్వాల 26వ రోజు కొన‌సాగింది. ప్ర‌స్తుతం క‌ర్నాట‌క రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో రాహుల్ యాత్ర కొన‌సాగుతోంది. కాగా, ఇవ్వాల యాత్ర‌లో ఫ్యాక్ట‌రీకి త‌ర‌లిస్తున్న చెరుకు రైతులు తార‌స‌పడ్డారు. వారు రాహుల్‌తో క‌లిసి న‌డుస్తూ చెరుకు గ‌డ‌ల‌ను అందించారు. రైతుల‌తో ముచ్చ‌టిస్తూ, వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ పాద‌యాత్ర కొన‌సాగించారు రాహుల్ గాంధీ. కాగా, తెలంగాణ‌లో పార్టీ అధికారంలోకి వ‌స్తే వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్‌లో పేర్కొన్న‌ట్టు నిజాం షుగ‌ర్ ఫ్యాక్ట‌రీని తిరిగి ప్రారంభిస్తామ‌ని ఈ సంద‌ర్భంగా కొంత‌మంది లీడ‌ర్లు గుర్తు చేశారు.

ఇక.. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సోమ‌వారం కర్నాటక చేరుకోనున్నారు. అక్టోబర్ 6న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆమె పాదయాత్రలో పాల్గొంటారు. సోనియా క‌ర్నాట‌క‌కు చేరుకోగానే కూర్గ్‌లోని మడికేరికి వెళ్లి ఓ ప్రైవేట్​ రిసార్ట్‌లో బస చేస్తారు. ఈ క్ర‌మంలోనే రాహుల్ గాంధీ మైసూరు యాత్ర ముగించుకుని మడికేరిలో సోనియా గాంధీని కలిసేందుకు వెళ్లనున్నారు. అక్టోబరు 6న భారత్ జోడో యాత్రను పునఃప్రారంభించే ముందు తల్లీ కొడుకులిద్దరూ కూర్గ్‌లో రెండు రోజులు గడపనున్నట్టు సమాచారం.

- Advertisement -

కాగా, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజా సమస్యలను ఎత్తిచూపడంతో పాటు గత వైభవాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త భారత్ జోడో యాత్రను చేపట్టింది. త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి నుంచి నుంచి కాశ్మీర్ వ‌ర‌కు ఈ యాత్ర సాగ‌నుంది. 3,570 కిలోమీట‌ర్లు.. 150 రోజుల సుదీర్ఘ దేశవ్యాప్త భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభం అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement