Tuesday, May 7, 2024

ఆహా అన్ స్టాప‌బుల్ షో లో డ్ర‌గ్స్ టాపిక్ : ర‌వితేజ ఏమన్నారంటే

అన్ స్టాప‌బుల్ ఆహా ఓటీటీలో వ‌స్తున్న షో. ఈ షోకి ఎన‌లేని ఆద‌ర‌ణ ల‌భిస్తుందంటే కార‌ణం హీరో నంద‌మూరి బాల‌కృష్ణ అనే చెప్పాలి. గెస్ట్ ల‌ని ఎంతో చ‌క్క‌గా ఆద‌రిస్తూ , వారి మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌టికి ర‌ప్పించ‌డంలో బాల‌య్య స్టైలే వేర‌ని నిరూపించారు. ఈ నేపథ్యంలో మాస్ మహారాజ్ రవితేజతో ఓ ఎపిసోడ్ చేసిన బాలకృష్ణ.. పలు కీలక విషయాలను ప్రస్తావిస్తూ లోతైన సమాచారం రాబట్టారు. ఈ ఎపిసోడ్‌లో మాస్ మహారాజ్ రవితేజ, గోపీచంద్ మలినేని సందడి చేయనున్నారు.తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా.. ఇందులో బాలకృష్ణతో గొడవపై రవితేజ చేసిన కామెంట్స్ హైలైట్ అయ్యాయి.

‘నీకు నాకు పెద్ద గొడవ అయ్యిందటగా ముందు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వు’ అని రవితేజను బాలకృష్ణ అడగ్గా.. ‘పనీపాట లేని డ్యాష్‌ గాల్లకు ఇదే పని’ అంటూ ఘాటు రియాక్షన్ ఇచ్చారు మాస్ మహారాజ్. మీకు కోపం వచ్చినప్పుడు వాడే నాలుగు బూతులు చెప్పమని బాలయ్య అడగడంతో.. నేను బూతులు మొదలు పెడితే చస్తారు గానీ అంటూ ఫన్నీగా స్పందించారు. ఇకపోతే రవితేజపై వచ్చిన డ్రగ్స్‌ ఆరోపణలను కూడా టచ్ చేస్తూ ప్రశ్నించారు బాలయ్య బాబు. ‘హెల్త్‌కు, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే నీ మీద డ్రగ్స్‌ కేసు పెట్టారు’ అని అడగ్గా.. ‘మొదట నాకే ఆశ్చర్యమేసింది. బాధ ఎక్కడ పడ్డానంటే.. పెంట పెంట చేశారు. అది కొంచెం బాధేసింది’ అంటూ ఓపెన్ అయ్యారు రవితేజ.ఈ ప్రోమో ఆక‌ట్టుకుంటుంది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement