Monday, April 29, 2024

డేంజ‌ర‌స్ డాగ్స్‌.. పిల్ల‌ల‌పై దాడి చేస్తున్న‌య్‌

గ్రామీణ ప్రాంతాల్లో కుక్కల బెడద అధికంగా ఉంది. గ్రామ సింహాలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామాన్ని రక్షించే గ్రామ సింహాలే ఇప్పుడు ప్రజల పాలిట మృత్యు సింహాలుగా మారుతున్నాయి. విశ్వాసానికి కేరాఫ్‌గా అడ్రస్‌గా నిలిచే కుక్కలు ఇప్పుడు దాడులు చేస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా పదర మండల కేంద్రంలో ఆదివారం పలువురు చిన్నారులపై పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గ్రామంలో పిచ్చి కుక్కల బెడద ఎక్కువై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.  

శకుక్కల సంఖ్య పెరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదని విమర్శలు వస్తున్నాయి.  శనివారం పిచ్చికుక్క నలుగురిపై దాడి చేసి గాయపరిచిందని పదో వార్డు సభ్యులు శంకర్ యాదవ్ తెలిపారు. ఆదివారం తొమ్మిది మంది పిల్లలను గాయపరిచిందని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పిచ్చి కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలని శంకర్ యాదవ్ కోరారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ శాసన మండలి కొత్త చైర్మన్ గా మాజీ స్పీకర్?

Advertisement

తాజా వార్తలు

Advertisement