Wednesday, May 1, 2024

కడుపులో కత్తెర వదిలేసిన డాక్టర్లు.. ఐదేళ్లుగా నరకం అనుభవిస్తున్న మహిళ

ఆమె పేరు హర్షినా.. వయస్సు 30 ఏండ్లు.. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్​లో ఉంటుంది. తనకు ఆరు నెలలుగా కడుపునొప్పి వస్తుండడంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతోంది. యాంటిబయాటిక్స్​, ఇతర పెయిన్​ కిల్లర్స్​ వంటివి ఇస్తున్నా అవేవీ ఈ నొప్పి నుంచి ఉపశమనం కల్పించడం లేదు. చివరకు ఓ ఆస్పత్రిలో చెకప్​కోసం వెళ్తే ఆమెకు స్కానింగ్​ చేశారు. దీంతో ఆమె కడపులో ఏదో మెటల్​ వస్తువు ఉన్నట్టు తేలింది. దీని కారణంగానే కడుపునొప్పి వస్తుందని డాక్టర్లు తేల్చేశారు. ఆమెకు ఆపరేషన్​ చేసి కడుపులో ఉన్న కత్తెర (ఫోర్సెప్స్​) తీశేశారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఐదేళ్లుగా హర్షినా విపరీతమైన కడుపునొప్పి అనుభవిస్తోంది.  గత ఆరు నెలలుగా అయితే భరించలేని నొప్పితో విలవిల్లాడిపోతోంది. ఈ నొప్పి తగ్గడానికి డాక్టర్లు ఆమెకు బలమైన యాంటీబయాటిక్స్ ఇస్తూ వస్తున్నారు. ఆమె చెకప్ కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా స్కానింగ్‌లో ఆమె కడుపులో మెటల్ వస్తువు ఉన్నట్లు తేలింది. – 2017లో ఆమెకు చివరిసారి సిజేరియన్ జరిగింది. ఆ క్రమంలోనే  డాక్టర్లు కడుపులో ఫోర్సెప్స్​ వదిలేసినట్టు తెలుస్తోంది. కోజికోడ్ మెడికల్ కాలేజీ డాక్టర్లు సెప్టెంబర్ 17న ఆమెకు ఆపరేషన్ చేసి ఐదేళ్లుగా ఆమె కడుపులో ఉన్న ఫోర్సెప్స్ ని తొలగించారు.

ఫోర్సెప్స్ అనేది శస్త్రచికిత్సల సమయంలో రక్తస్రావ నాళాలను గట్టిగా పటుకునేందుకు సర్జన్లు ఉపయోగించే కత్తెర లాంటి పరికరం. ఆ మహిళ 2017లో కోజికోడ్ మెడికల్ కాలేజీలో మూడోసారి సిజేరియన్ చేయించుకుంది. అంతకుముందు రెండు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఆపరేషన్లు చేయించుకుంది. మూడవ శస్త్రచికిత్స తర్వాత తనకు తీవ్రమైన నొప్పి ప్రారంభమైందని, అయితే.. అది  సిజేరియన్ సర్జరీ వల్లే అనుకున్నా అంటోంది. తాను చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్లాను కానీ,  వారు కడుపులో ఉన్న వస్తువుని గుర్తించలేకపోయారి చెబుతోంది.

స్పష్టంగా ఆ లోహపు వస్తువు తన మూత్రాశయాన్ని గుచ్చుతోందని, దాంతో ఇన్​ఫెక్షన్​ కావడం వ్లల భరించలేని నొప్పి వస్తోందని వెల్లడించింది. దీంతో ఆమె ప్రభుత్వ వైద్య కళాశాలను ఆశ్రయించగా డాక్టర్లు శస్త్రచికిత్స అనంతరం ఫోర్సెప్స్ తీసేశారు. అయితే.. ఐదేళ్ల క్రితం సర్జరీ చేస్తుండగా శరీరంలో ఫోర్సెప్స్ వదిలేశారని డాక్టర్లపై హర్షినా ఫిర్యాదు చేసింది.

- Advertisement -

ఆమె ఫిర్యాదుపై చర్య తీసుకున్న కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శనివారం ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. త్వరలో నివేదిక సమర్పించాలని ఆరోగ్య కార్యదర్శిని కోరినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. దీనికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కోజికోడ్ మెడికల్ కాలేజీ కూడా ఈ అంశంపై విచారణకు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement