Friday, May 3, 2024

వన ప్రేమి గ్రహీతకు ‘డాక్టరేట్’

సత్కరించిన గ్లోబల్ హ్యూమన్ పీస్ చెన్నై యూనివర్సిటీ
*సన్మానించిన ఎం.పి.డి.ఓ.కరణ్ సింగ్

కొత్తగూడ, ప్రభ న్యూస్ : కొత్తగూడ మండలానికి చెందిన వనప్రేమి అవార్డు గ్రహీత, వన ప్రేమి జన ప్రేమి స్వచంద సేవ వ్యవస్థాపకులు, పర్యావరణ వేత్త అయిన పులుసం సాంబయ్యకు ఈ నెల 11 న తమిళనాడులోని గ్లోబల్ హ్యూమన్ పీస్ చెన్నై యూనివర్సిటీ నుండి సామాజిక సేవా రంగంలో గౌరవ డాక్టరేట్ ను అందించి సత్కరించారు. అనంతరం స్వగ్రామానికి వచ్చిన వన ప్రేమి డాక్టర్ పులుసం సాంబయ్యకు దుర్గారం గ్రామపంచాయితి ఉద్యోగులు, యువజన సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ సాంబయ్యను ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడ మండల అభివృద్ధి అధికారి కరన్ సింగ్ హాజరై మాట్లాడుతూ.. ఈ రోజులలో గౌరవ డాక్టరేట్ తీసుకోవడం మామూలు విషయం కాదు అతడు ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా లాక్డౌన్ సమయంలో బీదలకు నిత్యావసర సరుకుల అందించడం, నిరుపేద విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్, పెన్నులు, టై బెల్ట్ లు, ఇంకా నీటి సంరక్షణ కోసం పర్యావరణ పరిరక్షణ కోసం, గో ఆక్సీజన్ గ్రీన్ యాత్ర లాంటి అనేక వినూత్న మైన కార్యక్రమాలు నిర్వహించి ఇలా అనేక సమాజానికి ఉపయోగపడే అవగాహన కార్యక్రమాలు నిర్వహించడని వాటి ఫలితమే ఈ గౌరవ డాక్టరేట్ అని, మున్ముందు మరిన్ని అవార్డులు పొందాలని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ సనప నరేష్,, ఉప సర్పంచ్ విజేందర్, పంచాయతీ కార్యదర్శి మల్లెల కళ్యాణి,దుర్గారం గ్రామపంచాయితి ఉద్యోగులు సంఘం అధ్యక్షులు గట్టి సమ్మయ్య,ఉపాధ్యాయులు పులుసం రమేష్, పులుసం ప్రమీల (స్కూల్ అసిస్టెంట్), పాపరావు, వంక జగన్, మణిశర్మ, వజ్జ సారంగపాణి,వజ్జ రాఘవులు, రామస్వామి, యుగేందర్, సాంబయ్య, వెంకటేశ్వర్లు, లక్ష్మీ నారాయణ, సురేందర్, అంగన్వాడీ టీచర్స్ పద్మ, మణెమ్మ, శాంత, గ్రామ పెద్దలు వజ్జ రామయ్య, రామస్వామి, రామ నర్సయ్య, వార్డ్ మెంబర్ సిద్దబోయిన శ్రీనివాస్, యువజన సభ్యులు, గట్టి సారంగపాణి, బానోతు పరమేష్, వజ్జ జయేందర్, జగన్, వజ్జ వెంకన్న, గట్టి పాపరావు, రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement