Wednesday, May 1, 2024

Spl Story | అదే పనిగా కూర్చుని వర్క్​ చేస్తున్నారా?.. అయితే, ఈ గండం ఉన్నట్టే జాగ్రత్త!

రక్త ప్రసరణ (బ్లడ్​ సర్క్యులేషన్​) అనేది శరీరంలోని ప్రధాన అవయవాలకు కావాల్సిన ఆక్సిజన్, ఇతర పోషకాలను అందించే ముఖ్యమైన శారీరక పనితీరు. ఇది ఒక ప్రాథమిక జీవ ప్రక్రియ కూడా. అయితే.. శరీర భాగాలకు సరైన తీరులో రక్తప్రసరణ జరగకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బలహీనమైన రక్త ప్రసరణను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతక పరిణామాలు సంభవించవచ్చు. ఎందుకంటే ఇది మెదడు, గుండె, మూత్రపిండాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చేతులు, కాళ్లలో తిమ్మిరి వంటివి రక్త ప్రసరణ సరిపోకపోవడం వల్ల కలిగే సాధారణ లక్షణాలలో ఒకటి.. అదే పనిగా కూర్చుని పనిచేసే వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడయ్యింది.

– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ

శారీరక శ్రమ లేకుండా.. ఏసీ, ఫ్యాన్​ గాలికి.. కుర్చీల్లో కూర్చుని హాయిగా వర్క్​ చేస్తున్నాం.. తమకేమీ ఇబ్బంది లేద అనుకునేవారు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే, వారిలో రక్త ప్రసరణకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అదేపనిగా కుర్చీల్లో సాగిలపడి కూర్చోవడం వల్ల కాళ్లకు బ్లడ్​ సర్య్కులేషన్​ తగ్గిపోయి.. కాళ్లలో వాపులు వస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా బాడీలో నిరంతరం జరిగే రక్త ప్రసరణలోనూ తేడాలుంటాయని, దీనివల్ల ఎన్నో హెల్త్​ ఇష్యూస్​ వస్తాయని అంటున్నారు.

నిరంతరం కుర్చీలో కూర్చుని పనిచేసేవారిలో ఒత్తుకుపోయిన (కంప్రెస్​డ్​ నర్వ్స్​) నరాలు, అధిక జలుబు, మెగ్నీషియం కొరత.. విటమిన్ B12 లోపం కనిపిస్తుంది. దీనివల్ల రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వంటివి తలెత్తుతాయి. బాడీలోని దిగువ, అంత్య భాగాలు అంటే కాళ్లలో వాపు బలహీనమైన రక్త ప్రసరణకు మరో స్పష్టమైన సూచన అని డాక్టర్లు చెబుతున్నారు.

సాధారణ ఆరోగ్యకరమైన స్థితిలో రక్త ప్రసరణ, రక్తపోటు మారదని.. ఇది అటానమిక్ నాడీ వ్యవస్థ ద్వారా నిర్వహణ జరుగుతుందంటున్నారు నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్​ న్యూరాలజీ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి బాల శర్మ. కానీ, దెబ్బతిన్నా నరాలు, స్వయంప్రతిపత్త నాడీ వ్యవస్థకు చెందిన వ్యాధిలలో.. రక్త ప్రసరణ, రక్తపోటు యొక్క స్వయంచాలక నియంత్రణ బలహీనపడుతుందని చెబుతున్నారు.

- Advertisement -

మనిషి నిటారుగా నిలుచున్న స్థితిలో రక్తం దిగువ అంత్య భాగాలకు చేరవచ్చు. ఈ క్రమంలో రక్తపోటు తగ్గుతుందని, కానీ, కుర్చీల్లో కూర్చొని పనిచేయడం వల్ల రక్త ప్రసరణ జరగక రక్తపోటు వంటి లక్షణాలు ఎక్కువ అవుతాయంటున్నారు. అయితే.. ఇట్లాంటి లక్షణాలను కాలి కదలికలు, కాలి వేళ్ల కదలికల ద్వారా కాస్త తగ్గించుకోవచ్చని, అంతేకాకుండా ఎక్కువగా ద్రవ పదార్థాలు తాగడం ద్వారా కూడా తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

ఇక.. 2016 జరిపిన ఓ సమీక్షలో.. మిస్సౌరీ-కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకులు తేల్చింది ఏంటంటే.. కూర్చున్నప్పుడు కాళ్లు కదలించడం ద్వారా కాళ్లలోని ధమనులు మూసుకుపోకుండా నిరోధించవచ్చని.. ధమనుల వ్యాధులను నివారించడంలో కూడా ఇది సహాయపడుతుందని కనుగొన్నారు. కంప్యూటర్, లేదా సుదీర్ఘ సమయం విమాన ప్రయాణాలు చేసే వారు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కాళ్లకు రక్తప్రసరణ తగ్గుతుందని.. హృదయ సంబంధ వ్యాధులకు ఇది దారితీస్తుందని వారి అధ్యయనంలో తెలిసింది.

బలహీనమైన రక్త ప్రసరణకు చెందిన లక్షణాలు.. (Symptoms of poor blood circulation)

క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం.. పేలవమైన ప్రసరణకు సంబంధించిన అనేక సూచనలు ఉన్నాయి.  ప్రధానంగా వాటిలో.. 

  • నడిచేటప్పుడు నొప్పి లేదా బలహీనంగా అనిపించే కండరాలు.
  • చర్మంపై ‘‘పిన్స్ లేదా సూదులు’’ గుచ్చినట్టు అనిపించడం.
  • నీలం లేదా లేత చర్మపు రంగులో ఉండే నరాలు
  • కాళ్లు, చేతులు చల్లబడడం
  • తిమ్మిర్లు రావడం
  • ఛాతీలో విపరీతమైన నొప్పి
  • కాళ్లలో వాపు, ఉబ్బిన సిరల వంటివి కనిపిస్తాయి.
Advertisement

తాజా వార్తలు

Advertisement