Sunday, May 5, 2024

కనకపుర నుంచి డీకే శివకుమార్‌ ఘన విజయం

కర్ణాటకలో జరుగుతున్న కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కనకపుర అసెంబ్లీ స్థానం నుంచి ఘనవిజయం సాధించారు. కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీలో డీకే శివకుమార్‌కు మంచి పట్టుంది. ఇప్పటివరకు ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అందులో గత నాలుగు పర్యాయాల నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. మూడు సార్లు కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా పనిచేశారు. తాజాగా మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా సీఎం పదవి రేసులో ఉన్నారు. కాంగ్రెస్‌ విజయం దాదాపు ఖాయం కావడంతో ఇప్పుడు సీఎం ఎవరవుతారనే దానిపై చర్చ మొదలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement