Tuesday, April 16, 2024

పుష్ప‌రాజ్ ని వాడేస్తోన్న అధికారులు

ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం పుష్ప‌. ఈ చిత్రం ప‌లు రికార్డుల‌ని సృష్టిస్తూ నిత్యం ఏదో ఒక‌లా వార్త‌ల్లో నిలుస్తోంది. కాగా పుష్ప చిత్రంలోని అల్లు అర్జున్ ఫొటోల‌ని వాడుకుని ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై నిబంధ‌న‌లు పాటించాల‌ని తెలిపారు. కాగా తాజాగా కేంద్ర స‌మాచార‌, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన చండీగ‌ఢ్‌ ప్రాంతీయ ఔట్రీచ్ బ్యూరో అధికారులు కూడా ఇటువంటి ప్ర‌యోగ‌మే చేశారు. పుష్ప రాజ్ మాస్క్ పెట్టుకున్న‌ట్లు ఓ ఫొటోను రూపొందించి అంద‌రూ ఇలా క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని సూచించారు. వ్యాక్సిన్లు వేసుకోవాల‌ని, వేసుకున్నాక కూడా మాస్కు ‘తీసేదే లే’ అని ‘పుష్ప’ రాజ్ చెబుతున్న‌ట్లు వారు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement