Saturday, May 18, 2024

ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సీఈఓ బ‌ర్త్ డే వేడుక‌ల్లో – ‘లైగ‌ర్’ టీం

బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత క‌ర‌ణ్ జోహార్ త‌న స‌న్నిహితురాలు, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సీఈఓ అపూర్వ మెహ‌తా బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా ఇచ్చిన పార్టీలో సంద‌డి చేశారు లైగ‌ర్ చిత్ర టీం. ఈ సందర్భంగా బ్లాక్ అండ్ బ్లాక్ లో ఈ యూనిట్ పార్టీలో అట్రాక్టివ్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే మరింత ఆకర్షణీయంగా ఉన్నారు. విజయ్ దేవరకొండ , అనన్య పాండే, పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ కూడా స్టార్-స్టడెడ్ ఈవెంట్‌లో చేరారు. అయితే స్టైలిష్‌గా ఎంట్రీ ఇవ్వడంతో లైగర్ టీమ్ అందరినీ ఆకర్షించింది. ఈవెంట్ కోసం బ్లాక్ డ్రెస్ కోడ్‌ను అనుసరించి, చిత్ర బృందం నలుపు రంగు దుస్తులను ధరించి కనిపించింది.

మరోవైపు అనన్య పాండే కూడా ట్రెండీ అవుట్ ఫిట్ పార్టీకి చేరుకుంది. మరీ ముఖ్యంగా అనన్య ధరించే దుస్తులు ఇటీవల కాలంలో మరీ హాట్ గా ఉంటున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఫొటోషూట్లలోనూ లైగర్ బ్యూటీ గ్లామర్ షో మామూలుగా ఉండటం లేదు. అనన్య అందానికి ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. పైగా బాలీవుడ్ లోనూ ఒక్కోమెట్టు ఎక్కుతూ తన పాపులారిటీని పెంచుకుంటోందీ బ్యూటీ..అయితే ఈ బర్త్ డే పార్టీలో విజయ్, పూరీ, చార్మి, అనన్య కలిసి అపూర్వను విషెష్ చేశారు. బాలీవుడ్ తారల మధ్య వీరి టీం కూడా వారెవ్వా అనిపించింది. ప్రస్తుతం ఈ పొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు చార్మి తన ఇన్ స్టాలో విజయ్, అనన్య పాండే మాట్లాడుకుంటున్న వీడియోను పోస్ట్ చేసింది. లైగర్ మూవీ ఆగస్ట్ 25న థియేటర్లలోకి రానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement