Saturday, April 27, 2024

ఢిల్లీలో నేడు, రేపు వర్షాలు పడే ఛాన్స్

దేశ రాజధాని ఢిల్లీలో నేటి కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్‌, గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు తేలికపాటి వర్షం కురుస్తుంద‌ని చెప్పింది. ఇక శనివారం కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. రేపు కూడా రాజధానిలో భారీ వర్షాలు కురవ‌నున్నాయి.నేడు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయింది. చండీగఢ్‌లో నేడు తేలికపాటి మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ , గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ గా ఉండి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుంది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ కూడా మేఘావృతమై ఉంటుంది. కాగా నేడు కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement