Monday, April 29, 2024

బ‌రితెగించిన ల‌వ‌ర్స్.. మెట్రో రైలులో రొమాన్స్

ఓ ప్రేమ జంట బ‌రితెగించి మెట్రో రైలులో రొమాన్స్ కొన‌సాగించారు.ఈ మ‌ధ్య కాలంలో ల‌వ‌ర్స్ ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నామన్న సోయిని కూడా మరిచిపోతున్నారు. పట్టపగలు నడిరోడ్ల మీద ..పార్కుల్లో ..జనసంచారం ఉన్న చోట కూడా రెచ్చిపోతున్నారు. చుట్టూ ఎవరైనా ఉన్నారన్న సోయి కూడా వారికి ఉండడం లేదు. కౌగిలింతలు.. ముద్దులతో రెచ్చిపోతున్నారు.కాగా రీసెంట్ గా ఢిల్లీ మెట్రోలో అందరూ చూస్తుండగానే ఓ జంట రెచ్చిపోయింది. ముద్దులు.. హగ్గుల తో రచ్చ చేసింది. పక్కనున్న వారు వీడియో తీసి షేర్ చేయడంతో ఈ అసభ్యత వెలుగుచూసింది. ఢిల్లీ మెట్రో లో జరిగిన ఈ అసాంఘిన పనిని వీడియోను షేర్ చేస్తూ హ్యాష్ ట్యాగ్ లతో జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. మెట్రోలో తోటి ప్రయాణికులు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం మరిచి ఓ జంట రెచ్చిపోయింది. గతంలో కూడా కొందరు లవర్స్ మెట్రోలో పబ్లిక్ ముందే ముద్దులిచ్చుకుంటూ ఇబ్బందులకు గురిచేశారు. ఇది మరువక ముందే మరో జంట సిగ్గువిడిచి ఇలా మెట్రోలోనే లిప్ కిస్ లు ఇచ్చుకోవడం చూసి ప్రయాణికులు అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోను షేర్ చేస్తూ చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటివి అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement