Thursday, May 2, 2024

త‌గ్గిన మాతా శిశు మ‌ర‌ణాలు..

హైదరాబాద్‌, : సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్రంలో మహిళలు, శిశువులలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు సీఎం కేసీఆర్‌ విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. ఆరోగ్యలక్ష్మీ, కేసీఆర్‌ కిట్‌తో బాల, బాలికల నిష్పత్తిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మాతా, శిశు మరణాలు తగ్గడం రే టు దేశంలో అత్యధికంగా తెలంగాణలో నమోదైంది. షోపకాహార లోపాన్ని నివారించి, శిశువు ల, మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఆరోగ్య వంతమైన పోషకాహారాన్ని అందించేందుకు ప్రభు త్వం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. గిరిజన ప్రాంతాల్లో వారి ఆహారపు అలవాట్లకు వీలుగా ఇప్పపువ్వు లడ్డూలను తయారీకి ప్రత్యేకంగా పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ- శిశువుల సంరక్షణ కోసం అమలు చేస్తున్న ఆరోగ్యలక్ష్మీ పథకంతో గర్భిణీలు, బాలింతలకు పోషకాహార లోపం చాలా వరకు తగ్గింది. ఇటీవల జాతీయ పోషకహార సంస్థ సర్వే ద్వారా వెల్లడైంది. ఆరోగ్యలక్ష్మీ పథకంలో ప్రతిరోజు 200 మిల్లి లీటర్ల పాలు, అంగన్‌వాడీలలో పోషక విలువలున్న భోజనం, బాలామృతం, గుడ్డు, ఐరన్‌ మాత్రలు ఇవ్వడంతో గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యవంతంగా ఉంటున్నారు.
గర్భిణీ అయిన తర్వాత పనిచేయడంవల్ల కడుపులో ఉన్న బిడ్డకు తల్లికి ప్రమాదమని భావించి గర్భిణీ 6వ నెల నుంచి ప్రసవించిన తర్వాత మూడో నెలవరకు నెలకు రూ.2000 చొప్పున ఆరు నెలలపాటు రూ.12 వేలు ఇచ్చి ఇంటివద్ద ఉండి మంచి ఆహారం తీసుకోని ఆరోగ్యవంతగా ఉండేందుకు ఈ పథకం దోహదపడుతుంది. ప్రభుత్వాస్పత్రిలో ప్రసవిస్తే కేసీఆర్‌ కిట్‌ ఇవ్వడంతో మాతా శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది.
పోషకాహార లోపాన్ని నివారించేందుకు కృషి
శిశువుల్లో వయసుకు తగిన ఎదుగుదల, ఎత్తుకు తగిన బరువు అనుకున్న స్థాయిలో లేకపోవడంపట్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పిల్లల్లో పోషకాహార లోపాన్ని పూర్తిగా నివారించి, వారికి ఆరోగ్యకర ఎదుగుదల ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఇటీవల స్త్రీ- శిశు సంక్షేమ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
దేశంలో శిశువుల కోసం ఎక్కడెక్కడ మంచి పథకాలు అమలు చేస్తున్నారో వాటన్నింటిని అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం తెలంగాణలో మహిళలకు ప్రతిరోజు 200 మిల్లి లీటర్ల పాలు, గుడ్లు అందిస్తున్న ప్రభుత్వం త్వరలో 7 నెలల నుంచి ఆరేళ్ల వరకు ఉన్న శిశువులకు కూడా పాలు ఇచ్చే ఆలోచన చేస్తోంది. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) సలహాలతో ఈ బాలామృతాన్ని మరింత అభివృద్ధిచేసి రుచికరంగా, ఆరోగ్యకరంగా రూపొందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గిరిజన ప్రాంతాల్లో గిరిపోషణ, ఇప్పపువ్వు లడ్డూ లను ఇవ్వడం ద్వారా పోషకాహార లోపాన్ని నివారించే కార్యక్రమాన్ని పైలట్‌ ప్రాజెక్టులో చేపట్టారు. దీనిని పో షకాహార లోపం తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు విస్తరిం చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
త‌గ్గిన భూణ హ‌త్య‌లు..
భ్రూణహత్యలపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టడంవల్ల తెలంగాణలో బాల, బాలికల నిష్పత్తి దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 1000 మంది బాలురకు 1049 మంది బాలికలు ఉన్నారు. ప్రభుత్వం బాలికల సంరక్షణకు ప్రత్యేక చొరవ చూపుతుందనడానికి రాష్ట్రంలోని బాల, బాలిక నిష్పత్తే నిదర్శమని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement