Tuesday, May 21, 2024

‘ద‌స‌రా’ చిత్రం నుండి అప్ డేట్ – రేపు మాస్ స‌ర్ ప్రైజ్

రేపు మార్చి 20న నేచుర‌ల్ స్టార్ హీరో నాని న‌టిస్తోన్న చిత్రం ద‌స‌రా నుండి మాస్ స‌ర్ ప్రైజ్ రానుంది. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను చిత్రబృందం సోషల్ మీడియాలో వెల్లడించింది. రేపు ఆదివారం ఉదయం 11.34 గంటలకు అందరికీ ఒక మాస్ సర్ ప్రైజ్ అని ప్రకటన చేసింది. స్పార్క్ ఆఫ్ దసరాను చూడబోతున్నారని పేర్కొంది. ఈ చిత్రంలో నానికి జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement