Thursday, May 2, 2024

నిన్న కూలీలు….నేడు పౌల్ట్రీ ఫార్మ్ యజమానులు

గండిలచ్చ పేటలో దళిత బంధు తో మారిన తండ్రి కొడుకుల బతుకు చిత్రం*… నేడు ప్రారంభించనున్న మంత్రి కేటి అర్

తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే దిశగా చైతన్యమై ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బంధు శతాబ్దాలుగా చీకటి అలుముకున్న పేద దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది.రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి మండలం గండిలచ్చ పేట గ్రామంలో దళిత బంధు పథకంలో భాగంగా సంతృప్త స్థాయిలో 34 కుటుంబాలకు దళిత బంధు పథకం కింద రైస్ డిపో, గొర్రెల యూనిట్ లు, లేడీస్ ఎంపోరియం, అటో మొబైల్, సెంట్రిక్ తదితర యూనిట్ లను మంజూరు చేయగా గ్రౌండింగ్ కూడ పూర్తి అయ్యింది.ఇదే గ్రామంలో చెదల దుర్గయ్య,చెదల సుమన్ లు తండ్రి కొడుకులు. కొడుకు కు పెళ్లవ్వడంతో తన భార్య , పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నాడు.ఇద్దరికి దళిత బంధు పథకం వర్తించడం తో ఉమ్మడి గా పౌల్ట్రీ ఫార్మ్ పెట్టుకున్నారు.ఒక్కప్పుడు కూలీనాలీ చేసుకుని జీవనం సాగించే దుర్గయ్య, సుమన్ లు దళిత బంధు తో పౌల్ట్రీ ఫార్మ్ యజమానులు గా మారారు.దళిత బంధు తో మా బ్రతుకు చిత్రం మారిందని సంబుర పడుతున్నారు. దళిత బందుతో కూలీలను యజమానులుగా చేసిన సిఎం కేసిఆర్, మంత్రి కే టి ఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement