Tuesday, April 30, 2024

ప్ర‌స్తుతం నేను వెజిటేరియ‌న్ ని.. విరాట్ కోహ్లీ

ప్ర‌స్తుతం తాను వెజిటేరియ‌న్ ని అని చెప్పారు టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ. ఆస్ట్రేలియాతో రెండో టెస్టు సందర్భంగా.. తనకు ఇష్టమైన ఆహారం వచ్చినప్పుడు కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.చొల్లే కుల్చే’ అనే ఐటమ్.. తనకు ఇష్టమైన ఆహారమని కోహ్లీ చెప్పాడు. అయితే తాను ఎన్నటికీ తిననిది ఏంటో కూడా చెప్పేశాడు. అతడితో నెటిజన్లు కూడా ఏకీభవించడం గమనార్హం. ఇంతకీ ఆ ఐటమ్ ఏంటంటే.. కాకరకాయ. ఇన్ స్టా గ్రామ్ లో ఆస్క్ మి ఎనీథింగ్ సెషన్ వీడియోను కోహ్లీ షేర్ చేశాడు. అందులో ప్రస్తుతం తాను వెజిటేరియన్ ను అని చెప్పాడు. అయితే కాకరకాయను మాత్రం ఎన్నటికీ తిననని తెలిపాడు. గతంలో తాను తిన్న విచిత్ర వంటాన్ని గురించి వివరించాడు. మలేసియాలో ఓ రకమైన కీటకపు వంటను రుచి చూసినట్లు గుర్తు. అయితే అదేంటో నాకు తెలియదు. దాన్ని ఫ్రై చేశారు. తిన్నాను. అసహ్యంగా అనిపించింద‌న్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement