Thursday, April 25, 2024

Breaking: క్యూరియాసిటీ పెంచుతున్న‌ ‘మేజ‌ర్’ ట్రైల‌ర్.. యాక్షన్​, డైలాగ్స్​ అదుర్స్​!

26/11 ముంబై ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజ‌ర్ సందీప్ ఉన్ని క్రిష్ణ‌న్ జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం మేజ‌ర్ (Major). శ‌‌శి కిరణ్ టిక్కా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ (Tollywood) యాక్ట‌ర్ అడివి శేష్ టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ ఇవ్వాల విడుద‌ల చేశారు. ‘బార్డ‌ర్ దాటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ క‌శ్మీర్‌ (పీవోకే)లోకి వెళ్ల‌డ‌మేంటి.. సందీప్ అది వాళ్ల‌ది..అని ఉన్న‌తాధికారి అంటుంటే..అదీ మ‌న‌దే క‌దా సార్‌.. అని సందీప్ ఉన్నిక్రిష్ణ‌న్ (అడివి శేష్ పాత్ర‌) అంటున్న సంభాష‌ణ‌ల‌తో షురూ అయింది ట్రైల‌ర్‌.

ఆ త‌ర్వాత ‘అమ్మా సందీప్.. క‌న్నా లే అమ్మా.. వాళ్లు మంచి కాదు.. పెద్ద పెద్ద త‌ప్పులు చేసేవాళ్లు.. నాకు ఎంత భ‌య‌మేసిందో తెలుసా..? అని అత‌ని త‌ల్లి అంటుంటే.. అయ్యో ఏం ప‌ర్లేద‌మ్మా.. నీకు నేనున్నానుగా..’అని సందీప్ అంటున్నాడు. ఎన్డీఏ ఆర్మీ అంటే భ‌య‌మేస్తుంది రా.. నీకేమైనా అయితే.. అని సందీప్ తల్లి బాధ‌ప‌డుతుండ‌టం ట్రైల‌ర్లో చూడొచ్చు. ‘సందీప్ ఆర్మీలో జాయిన్ అవ‌డం మాకిష్టం లేదు. ప్ర‌తీ రోజు ప్ర‌తీ క్ష‌ణం లైఫ్‌ను రిస్క్‌లో పెట్టుకోవ‌డం.. కానీ జ‌వాను జీవితం అది.. అత‌డు ఆ జీవితాన్ని ఎంచుకున్నాడు. వాడికి మంచి భ‌ర్త‌గా ఉండ‌టం కంటే.. మంచి కొడుకుగా ఉండ‌టం కంటే.. మంచి సోల్జ‌ర్‌గా ఉండ‌టం అవ‌స‌రం అని’ సందీప్ తండ్రి పాత్ర‌లో న‌టించిన‌ ప్ర‌కాశ్ రాజ్ (Prakash Raj) చెబుతున్న సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. ప్ర‌కాశ్ రాజ్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement