Monday, April 29, 2024

కొవిషీల్డ్‌ డోసుల వ్యవధి తగ్గింపు.. 8-16 వారాలకే

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకా విషయంలో జాతీయ సాంకేతిక సలహాబృందం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య వ్యవధిని 8-16 వారాలకు తగ్గించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పటి వరకు రెండు డోసుల మధ్య వ్యవధి 12-16 వారాలుగా ఉంది. అంటే మొదటి డోసు తీసుకున్న 84 రోజుల తర్వాత తదుపరి డోసు తీసుకునేలా నిబంధనలు న్నాయి. ఇప్పుడు ఈ వ్యవధిని సగానికి తగ్గించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిరూపితమైన సమాచారాన్ని బట్టి ఎన్‌టిఎజిఐ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా 6-7 కోట్ల మంది ప్రజలు రెండో డోసును వేగవంతంగా తీసుకునేందుకు వీలుకలుగుతుంది. మరొక స్వదేశీ టీకా సంస్థ భారత్‌ బయోటెక్‌ టీకాల వ్యవధిని మాత్రం యదావిధిగా ఉంచింది. కొవాగ్జిన్‌ మొదటి, రెండవ డోసుకు మధ్య కనీస వ్యవధి ఇప్పుడు 28 రోజులుగా ఉంది.

యాక్టివ్‌ కేసులు 26 వేలు..
దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. తాజాగా కొత్త కేసులు 1700కు దిగొచ్చాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 4,31,973 నిర్ధారణ పరీక్షలు నిర్వ#హంచగా.. 1,761 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.మరో 127 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 5,16,479కి చేరింది. తాజాగా 3196 మంది కోలుకోగా.. మొత్తం రికవరీలు 4.24 కోట్లు దాటాయి. రికవరీరేటు 98.74 శాతానికి పెరిగింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 26,240గా ఉన్నాయి. మొత్తం కేసుల్లో వీటిశాతం 0.06శాతం మాత్రమే ఉన్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా తాజాగా 15,34,444 మంది టీకాలు వేయించుకోగా.. మొత్తం పంపిణీ చేసిన డోసుల సంఖ్య 181 కోట్లు దాటింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement