Monday, April 29, 2024

Covid Vaccine: భారీగా తగ్గిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ ధరలు

క‌రోనా మ‌హ‌మ్మారి కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. బారి నుంచి ర‌క్ష‌ణ కోసం వినియోగిస్తున్న వ్యాక్సిన్ పంపిణీకి సంబంధి తొలి రెండు డోసుల‌ను ఉచితంగానే పంపిణీ చేసిన కేంద్రం.. తాజాగా బూస్ట‌ర్ డోసును మాత్రం కొనుక్కోవాల్సిందేన‌ని స్పష్టం చేసింది. అయితే వృద్ధులు, ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కు మాత్రం ఉచితంగా అందిస్తోంది. మిగిలిన వారంతా బూస్ట‌ర్ డోసుకు రుసుము చెల్లించాల్సిందే.

దేశీయ వ్యాక్సిన్ త‌యారీ సంస్థ‌లు సీరం, భార‌త్ బ‌యోటెక్‌లు బూస్ట‌ర్ డోసుల ధ‌ర‌ల‌ను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. సీరం ఇన్‌స్టిట్యూట్ త‌న కోవిషీల్డ్ ధ‌ర‌ను రూ.600ల నుంచి రూ.225కు త‌గ్గించింది. సీరం నుంచి ప్ర‌క‌ట‌న వ‌చ్చినంత‌నే భార‌త్ బ‌యోటెక్ కూడా త‌న కోవాగ్జిన్ ధ‌ర‌ను రూ.1,200ల నుంచి రూ.225కు త‌గ్గించింది. ఈ మేరకు కాసేప‌టి క్రితం భార‌త్ బ‌యోటెక్ జాయింట్ ఎండీ సుచిత్రా ఎల్లా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బూస్ట‌ర్ డోసును ఈ రెండు సంస్థ‌లు రూ.225ల‌కే అందించనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement