Saturday, May 4, 2024

క‌రోనా నివార‌ణ‌కు గంజాయి కీల‌కం – యునైటెడ్ స్టేట్స్ ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి

కోవిడ్ నివార‌ణ‌కు గంజాయి కీల‌క‌మ‌ని యునైటెడ్ స్టేట్స్ లో నిర్వ‌హించిన ఓ తాజా ప‌రిశోధ‌న‌లో తెలిపారు. ఈ మొక్క‌లో వైర‌స్ మాన‌వ క‌ణాల‌లోకి ప్ర‌వేశించ‌కుండా నిరోధించే స‌మ్మేళ‌నాలు ఉన్నాయ‌ని వెల్ల‌డించింది. రిచ‌ర్డ్ వాన్ బ్రీమెన్, ఒరెగాన్ స్టేట్ యూనివ‌ర్శిటీకి చెందిన శాస్త్ర‌వేత్త‌ల బృందం నిర్వ‌హించిన ప‌రిశోధ‌న ప్ర‌కారం గంజాయిలో సాధార‌ణంగా కంటే బిడియోలిక్ యాసిడ్ అని పిలువ‌బ‌డే స‌మ్మేళ‌నాలు SARS-CoV-2 స్పైక్ ప్రోటీన్‌తో బంధిస్తాయ‌ని తెలిపారు. అంతేకాకుండా రస్ మానవులకు సోకే ప్రక్రియలో ముఖ్యమైన దశను నిరోధించగలవు. ఈ అధ్యయనం ‘జర్నల్ ఆఫ్ నేచురల్ ప్రొడక్ట్స్’ అనే జర్నల్‌లో ప్రచురించబడింది. ఈ అధ్యయనం వెలువడినప్పటి నుంచి.. Marijuana (గంజాయికి మరొక సాధారణ పేరు) స్మోక్ చేయడం అనేది కోవిడ్ -19 ను దూరంగా ఉంచడంలో సహాయపడుతుందా.. ప్రశ్న చాలా మందిలో తలెత్తింది. అయితే ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement