Tuesday, April 23, 2024

Virat Kohli Quitting: టెస్టు కెప్టెన్సీకి కోహ్లి గుడ్‌ బై.. సౌరవ్ గంగూలీ ఏమన్నాడంటే..

టీమిండియా టెస్ట్‌ సారధ్య బాధ్యతల నుంచి కెప్టన్ విరాట్‌ కోహ్లి వైదొలుగుతున్నట్లు చేసిన సంచలన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌ కోల్పోయిన మరుసటి రోజే కోహ్లి సంచలన నిర్ణయం తీసుకోవడం క్రికెట్‌ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. భారత టెస్ట్ జట్టు కెప్టెన్ పదవికి తప్పుకుంటున్నట్లు నిన్న కోహ్లీ ట్విటర్‌ వేదికగా ప్రకటించాడు. గత 7 ఏళ్ల కెప్టెన్సీ ప్రయాణంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. కెప్టెన్‌గా అవకాశం ఇచ్చిన బీసీసీఐకి సైతం థ్యాంక్స్‌ తెలిపారు. తనకు అండగా నిలిచిన రవిశాస్త్రికి, ధోనికి ధన్యవాదాలు చెప్పారు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. కెప్టెన్సీ వదులుకునేందుకు ఇదే సరైన సమయం అని పేర్కొన్నారు. కెప్టెన్సీ ఎప్పటికైనా వదులుకోక తప్పదన్న కోహ్లీ.. కెప్టెన్సీ అవకాశం ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు అని చెప్పారు.
కోహ్లీ నిర్ణయంపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. టీ20 క్రికెట్ జట్ల కెప్టెన్ రోహిత్ శర్మ సైతం కోహ్లీ నిర్ణయంపై ఆదివారం స్పందించాడు. కోహ్లీ నిర్ణయం తనను షాక్ కు గురి చేసిందని అన్నారు. భారత కెప్టెన్ గా విజయవంతమైన సేవలు అందించినందుకు అభినందనలు తెలిపారు. కోహ్లీ భవిష్యత్తు మరింత బాగుండాలని పేర్కొన్నారు.

టెస్టు కెప్టెన్సీకి గుడ్‌ బై చెబుతూ విరాట్‌ కోహ్లి తీసుకున్న నిర్ణయంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందించాడు. అన్ని ఫార్మాట్లలోనూ భారత జట్టును అగ్రపథంలో నిలపడంలో విరాట్‌ ఎనలేని కృషి చేశాడన్నాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం తన వ్యక్తిగత నిర్ణయమని, బీసీసీఐ దీనిని గౌరవిస్తుందని పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement