Saturday, May 18, 2024

పెరిగిన క‌రోనా కేసులు-57మంది మృతి

నేడు కొత్త‌గా 18,313క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసులు 4,39,38,764కు చేరాయి. ఇందులో 4,32,67,571 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,167 మంది కరోనాతో కన్నుమూశారు. మరో 1,45,026 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 57 మంది మృతిచెందగా, 20,742 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. రోజువారీ పాజిటివిటీ రేటు 4.31 శాతంగా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.47 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇక ఇప్పటివరకు 202.79 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement