Friday, April 26, 2024

సుప్రీంకోర్టులో క‌రోనా క‌ల క‌లం – ప‌ది మంది జ‌డ్జిల‌కు పాజిటీవ్

ఇప్పుడంతా క‌రోనా మ‌యంగా మారింది. సుప్రీంకోర్టులో క‌రోనా క‌ల‌క‌లం చెల‌రేగింది. ఏకంగా ప‌ది మంది జ‌డ్జిల‌కు క‌రోనా పాజిటీవ్ గా తేలింది. సుప్రీంకోర్టులో కోవిడ్ పాజిటివిటీ రేటు 30శాతానికి పెరిగింద‌ని సుప్రీంకోర్టు ఉద్యోగులు వెల్ల‌డించారు. మొత్తం 32మంది జ‌డ్జిలు ఉండ‌గా ప‌దిమందికి క‌రోనా సోకింది. జస్టిస్ కెఎమ్ జోసెఫ్, జస్టిస్ పిఎస్ నరసింహులు కరోనా నుంచి కోలుకుని తిరిగి విధులకు హాజరు అవుతున్నారు. మిగతా ఎనిమిది మంది జడ్జీలు కరోనాతో క్వారంటైన్ లో ఉన్నారు. దీంతో సుప్రీం కోర్టులో అత్యవసర కేసుల విచారణకు బెంచ్ లఏర్పాటు చీఫ్ జస్టిస్ ఎన్ .వి.ర‌మ‌ణ‌కి ఛాలెంజ్ గా మారింది.

సుప్రీంకోర్టులో కోవిడ్ కలకలంతో 24 గంటల పాటు వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు. సుప్రీంకోర్టులో ప్రతిరోజు 200మంది వరకు ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో 1500 మంది ఉద్యోగులు ఉంటే వారిలో 400 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. సుప్రీం కోర్టు ప్రాథమిక వైద్య కేంద్రంలో పనిచేస్తున్న ముగ్గురు వైద్యులకు కూడా కరోనా సోకింది. వారం రోజుల్లో కరోనా సోకిన జడ్జిల సంఖ్య రెట్టింపు అయ్యింది. సుప్రీంకోర్టులో కరోనా కేసులు వ్యాప్తితో కోర్టుల్లో వర్చువల్ గా హియరింగ్ లు సాగుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement