Sunday, May 5, 2024

కంటెంట్‌, డిజిటల్‌ హెడ్ శర‌త్ చంద్ర నాయుడు బ‌ర్త్ డే – స‌ర్ ప్రైజ్ ఇచ్చిన ‘అల్లు అర్జున్’

త‌న సిబ్బందిని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన కంటెంట్‌, డిజిటల్‌ హెడ్‌ అయిన శరత్‌ చంద్ర నాయుడు పుట్టిన రోజు వేడుకని ఘనంగా జరిపారు. డిజిటల్ హెడ్ పుట్టిన రోజు కావడంతో సడన్‌గా కేక్‌ తీసుకొచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు. బర్త్‌డే సెలబ్రేట్‌ చేసి హడావిడి చేశాడు. సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్స్‌ అన్నీ ఆ కేక్ మీద హైలెట్ చేశారు. దీన్ని బట్టి తన టీమ్ ను ఆయన ఎంత స్పెషల్ గా చూసుకుంటారో మరోసారి నిరూపించారు. తన స్టాఫ్‌ బర్త్‌డే వేడుకలను సెలబ్రేట్‌ చేయడం బన్నీకి ఇది ఫస్ట్ టైమ్ కాదు. చాలా సార్లు చాలా మంది బర్త్‌డేలను సెలబ్రేట్‌ చేశారు. స్పెషల్‌ అకేషన్స్‌ అన్ని అలానే చేస్తుంటాడు. అంతే కాదు తన టీమ్ లో పనిచేస్తున్న చిన్నవాళ్ల పెళ్లిళ్లకు కూడా బన్నీ హాజరవుతుంటారు. వాళ్ళు కూడా అల్లు అర్జున్ ను చాలా ప్రేమగా చూసుకుంటారు. బన్నీ దొరకడం మా అదృష్టం అంటుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement