Monday, May 6, 2024

రాజీనామాపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్య

కాంగ్రెస్‌ పార్టీని రాజీనామా చేస్తానంటూ సంచలన రేపిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి భవిష్యత్ కార్యచరణ ఏంటి? అన్నది సస్పెన్స్ గా ఉంది. ఆయన టీఆర్ఎస్ లో వెళ్తారంటూ ప్రజచారం జరుగుతున్న వేళ.. పార్టీ కార్యకర్తలతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బయటవారికంటే తమ పార్టీ వారే అనవసర ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను టీఆర్‌ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదన్న జగ్గారెడ్డి.. ఒకవేళ తాను టీఆర్‌ఎస్‌లోకి వెళ్తానంటే అడ్డుకునే వారు లేరని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ లోకి పోతారని ఎదుటి పార్టీ కంటే సొంత పార్టీ వాళ్ళే ఎక్కువ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఉండాలా?సొంత పార్టీ పెట్టాలా? అనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. హైకమాండ్‌ను కలిసే వరకు రాజీనామా చేసే ప్రసక్తే లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement