Saturday, May 11, 2024

Congress Action Plan – ఓట్లు చీల‌కుండా కూట‌మి వ్యూహం…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ అన్ని రకాలుగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీలోని అసం తృప్తులతో పాటు కాంగ్రెస్‌ వీడిన వారిని తిరిగి సొంత గూటికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలను పీసీసీ ముమ్మరం చేసింది. దీంతో పాటు ప్రభు త్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్‌ పార్టీ మరింత జాగ్రత్త పడుతోంది. అందుకు బీఆర్‌ ఎస్‌, బీజేపీయేతర పార్టీలు, ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విధంగా కాంగ్రె స్‌ పార్టీ ఇప్పటి నుంచి పావులు కదుపుతోంది. తెలంగాణ జన సమితి, వైఎస్‌ఆర్‌టీపీతో పాటు వామపక్షాలు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా సంఘాలతో పాటు కవులు, కళాకారులను ఏకతాటిపైకి తెచ్చేందుకు టీజేఎస్‌ రాష్ట్ర అధ్య క్షుడు కోదండరామ్ ను కాంగ్రెస్‌ పార్టీ ముందుకు పెట్టినట్లుగా గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

అవసరమైతే విపక్ష కూటమిని ఏర్పాటు చేసి కూటమి బాధ్యతలను కోదండరామ్‌కు అప్పజెప్పుతారనే టాక్‌ వినిపిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జేఏసీ చైర్మన్‌గా పని చేయడమే కాకుండా.. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కీలకంగా పని చేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌తో గ్యాప్‌ రావడం.. టీజేఎస్‌ ఏర్పాటు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పని చేశారు. ఇటీవల జరిగిన ఆ పార్టీ ప్లీనరీ సమావేశంలో అవసరమైతే టీజేఎస్‌ను విలీనం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కోదండరామ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా బీఆర్‌ఎస్‌ వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి నడుస్తారని చెబుతున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తోనూ షర్మిల రెండు సార్లు భేటీ కావడంతో కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీని విలీనం చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఇక వామపక్ష పార్టీలు కూడా ప్రస్తుతం బీఆర్‌ఎస్‌తోనే ఉన్నాయి. మునుగోడు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ఇవ్వడంతో పాటు.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక కూటమితో కలిసి నడుస్తామని కూడా ప్రకటించాయి. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒక్కటేననే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. వామపక్షాలను కూడా కాంగ్రెస్‌ వైపు తిప్పుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలని ఆలోచనతో కాంగ్రెస్‌ నేతలున్నారు.

చేరికలపైన పీసీసీ ప్రత్యేక దృష్టి
వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్‌.. ప్రత్యర్థి పార్టీల్లోని నేతలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బీఆర్‌ఎస్‌, బీజేపీలకు చెందిన నాయకులకు కాంగ్రెస్‌ కండువా కప్పేంత వరకు బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముందుకెళ్లుతున్నారు. తాజాగా కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి నివాసానికి రేవంత్‌రెడ్డి వెళ్లడం ఇప్పుడు హాట్‌ టాఫిక్‌గా మారింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని రేవంత్‌రెడ్డి కోరగా.. అందుకు గుర్నాథ్‌రెడ్డి అంగీకరించారని.. ఆదివారం కాంగ్రెస్‌లో చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గుర్నాథ్‌రెడ్డి చేరికతో కొడంగల్‌లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. కాగా, రేవంత్‌రెడ్డి టీడీపీ నుంచి 2014 ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి పోటీ చేయగా.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉన్న గుర్నాథ్‌రెడ్డిపైనే విజయం సాధించారు. మరో వైపు హస్తం పార్టీలో చేరేందుకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కూచుకల్లదామోదర్‌రెడ్డి అంగీకరించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 21న స్వదేశానికి వస్తున్న రాహుల్‌గాంధీతో ఆ ముగ్గురు నేతలు సమావేశం కానున్నారని తెలిపాయి. ఆ తర్వాత ఖమ్మం, నాగర్‌కర్నూల్‌లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ తరుణంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ భేటీ అయ్యారు. జూపల్లి ఇంటికి వెళ్లి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

- Advertisement -

హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలపై ఫోకస్‌..
ఇదిలా ఉండగా, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ బలహీనంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్‌.. రాష్ట్ర విభజన తర్వాత కొందరు నాయకులు బీఆర్‌ఎస్‌, బీజేపీలోకి వెళ్లారు. ఈ రెండు జిల్లాలలో 24 అసెంబ్లి నియోజక వర్గాలు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని కేంద్రంలో పార్టీ బలంగా లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పీసీసీ భావిస్తోంది. ఒక వైపు పార్టీ కార్యక్రమాలు విస్తృతం చేస్తూ కేడర్‌లో ఉత్సాహం నింపుతూ ఇతర పార్టీలోని బలమైన నాయకులు కాంగ్రెస్‌లోకి చేర్చుకోవాలని భావిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డిలోని మహేశ్వరం, షాద్‌నగర్‌, సికింద్రాబాద్‌ తదితర నియోజక వర్గాల్లోని బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలకు చెందిన వందలాది మంది కార్యకర్తలను రేవంత్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. భవిష్యత్‌లో మరిన్ని చేరికలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement