Friday, April 26, 2024

కేజీఎఫ్2- మ‌ళ్లీ అద్భుతం చేశారంటోన్న హీరో రానా

కేజీఎఫ్‌2 చిత్రంపై ప్ర‌శంస‌లు కురిపించాడు హీరో ద‌గ్గుబాటి రానా. కేజీఎఫ్-2” టీంను సోషల్ మీడియా వేదికగా అభినందించారు.
వైల్డ్ వైల్డ్ మెన్ మీరు మళ్లీ అద్భుతం చేశారు. యష్, ప్రశాంత్ నీల్ బాగా చేసారు. KGF టీం అందరికీ భారీ అభినందనలు” అంటూ రానా దగ్గుబాటి శాండల్‌వుడ్ మాగ్నమ్ ఓపస్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. కొన్ని రోజుల క్రితం రానా “ఆర్ఆర్ఆర్” బ్లాక్ బస్టర్ హిట్ పై స్పందించిన విషయం తెలిసిందే. రానా నటించిన “విరాటపర్వం” విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ‘కేజీఎఫ్ 2’ విషయానికొస్తే… హోంబలే ఫిలింస్ మూవీని నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ సినిమాలో రవీనా టాండన్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రావు రమేష్, ప్రకాష్ రాజ్ కూడా నటించారు. ఈ చిత్రం క‌లెక్ష‌న్ల రూపంలో కూడా దూసుకుపోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement