Saturday, April 20, 2024

ఆహాలో గ‌ని – ఎప్పుడంటే

కనీవినీ ఎరుగని స్టైల్ లో “గని” వస్తున్నాడు అంటూ ఒక చిన్న ఆసక్తికర టీజర్ ను పోస్ట్ చేశారు తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వారు. థియేటర్‌లలో “గని” సినిమాను మిస్ అయిన వారు ఈ శుక్రవారం ఆహాలో కుటుంబంతో చూసి ఆనందించవచ్చు. అల్లు బాబీ, సిద్ధు ముద్దా నిర్మించిన “గని” చిత్రంలో సాయి మంజ్రేకర్, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నదియా, నవీన్ చంద్ర, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. మరి థియేటర్లలో ప్లాప్ టాక్ ను అందుకున్న “గని”కి ఓటిటిలో ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం “గని” ఏప్రిల్ 8న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ బాక్సింగ్ డ్రామా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ తేజ్ కూడా అంగీకరించారు. ఓ లేఖ ద్వారా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని, కానీ వారిని అలరించడానికి మరింత కష్టపడతానని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement