Monday, April 29, 2024

Breaking | తెలంగాణ‌లో కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ వేటు.. ఎవ‌రెవ‌రు బ‌దిలీ అయ్య‌రంటే..

తెలంగాణ‌లో ప‌లువురు ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌పై ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ బ‌దిలీ వేటు వేసింది. ఇందులో న‌లుగురు క‌లెక్ట‌ర్లున్నారు. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లాల కలెక్టర్ల బదిలీకి ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేకాకుండా 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్ల బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాకుండా రవాణాశాఖ కార్యదర్శి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ బదిలీకి ఈసీ ఆదేశించింది. ఎక్సైజ్, వాణిజ్యపన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీసు కమిషనర్ల బదిలీ చేయాల‌ని ఈసీ ఆదేశాలున్నాయి. రేపు (గురువారం) సాయంత్రం 5 గంటల వరకు ప్యానల్‌కు పంపాలని ఈసీ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది.

వేటు వేసింది వీరిపైనే..

తెలంగాణ ఎన్నికల కమిషన్ సీరియస్ గా స్పందించింది. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లతో పాటు వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్ సీపీలను బదిలీ చేసింది.. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ముషారఫ్ అలీ, వాణిజ్య పనుల కమిషనర్ శ్రీదేవి, రవాణా శాఖ కమిషనర్ శ్రీనివాసరాజులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తొమ్మిది జిల్లాల ఎస్పీలను మార్చుతూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన అనంతరం ఇంత పెద్ద మొత్తంలో అధికారులను ఎన్నికల కమిషన్ బదిలీ చేయడం ఇదే మొదటిసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement