Monday, May 6, 2024

AP | అర్హతా ప్రమాణాల లోపంతోనే ఆ టెండర్ల తిరస్కరణ.. డిస్కోమ్ సీఎండీ స్పష్టీకరణ

తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో): గతంలో బిహెచ్ఇఎల్ సరఫరా చేసిన విసిబిల కొనుగోలు తర్వాత సర్వీసు మెరుగ్గాలేదని ఫీల్డ్ ఆఫీసర్ల నుంచి అందిన సమాచారం మేరకు బిహెచ్ఇఎల్ టెండర్లను పరిగణలోకి తీసుకోలేదదని ఎపిఎస్పిడిసిఎల్ (సదరన్ డిస్కం ) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోష రావు వెల్లడించారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఎపిఎస్పిడీసీఎల్ పరిధిలోని ఆరుజిల్లాల్లో వివిధ పరికరాల కొనుగోలు కోసం గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ (జెమ్) పోర్టల్ ద్వారా టెండర్లను ఆహ్వానించం జరుగుతోందని వివరించారు. విద్యుత్ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) కింద 2,807 11కెవి విసిబిల సరఫరా కోసం జూన్ -2023లో టెండర్లను ఆహ్వానించామని తెలిపారు.

ఆ టెండర్లలో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బిహెచ్ఇఎల్)/ హైదరాబాద్, స్టైల్మెక్ లిమిటెడ్/ముంబయి, మెగావిన్ స్విచ్ గేర్ ప్రై. లి./ సేలం సంస్థలు పాల్గొన్నాయని, వీటిలో స్టైల్మెక్ లిమిటెడ్ / ముంబయి, మెగావిన్ స్విచ్ గేర్ ప్రై.లి./ సేలం సంస్థలు సాంకేతిక అర్హత సాధించాయని తెలియజేశారు. సాంకేతికంగా అర్హత సాధించడం కోసం విసిబిల పరిమాణం, పనితీరుకు సంబంధించిన ధృవపత్రాలను బిహెచ్ఇఎల్ పొందుపరచలేదని. దీంతో బిహెచ్ఇఎల్ సాంకేతికపరమైన అర్హతను సాధించలేదన్నారు. గతంలో బిహెచ్ఇఎల్ సరఫరా చేసిన విసిబిల కొనుగోలు తర్వాత సర్వీసు మెరుగ్గాలేదని ఫీల్డ్ ఆఫీసర్ల నుంచి అందిన సమాచారం మేరకు బిహెచ్ఇఎల్ టెండర్లను పరిగణలోకి తీసుకోలేదదని తెలిపారు.

అంతేకాకుండా గతంలో బిహెచ్ఇఎల్ కు ఇచ్చిన ఆర్డర్ మేరకు విసిబిలను నిర్దిష్ట కాలం ప్రకారం సరఫరా చేయాల్సివుండగా, ఆలస్యంగా (157 నుంచి 450 రోజుల వరకు) విసిబిలను సరఫరా చేయడం కారణంగా ప్రస్తుతం బిహెచ్ఎఎల్ సంస్థ టెండరును సాంకేతికంగా పరిగణలోనికి తీసుకోలేదని తెలిపారు. పంజాబ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ, పాటియాలా కూడా బిహెచ్ఇఎల్ ను 2025 వరకు బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగిందని వివరించారు.

- Advertisement -

సాధారణంగా విసిబిల్లో సమస్య ఉత్పన్నమైనపుడు వెంటనే ఆ లోడ్ను మరో ఎసిబిపై వేయాల్సి వస్తోందని, తద్వారా ఆ విసిబిపై వున్న విద్యుత్ సర్వీసులకు కూడా సరఫరాల్లో అంతరాయం ఏర్పడంతో పాటు సరఫరా కొనసాగుతున్న విసిబిపై లోడ్ అధికంగా వుంటుందన్నారు. ఈవిధంగా ఒక బ్రేకర్లో సమస్య వచ్చినపుడు, ఆ బ్రేకర్కు మరమ్మతు పూర్తిచేసి సర్వీసులో పెట్టేంత వరకు సరఫరాలో అంతరాయం కొనసాగి వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవడంతోపాటు విద్యుత్ పంపిణీ నష్టాలు పెరుగుతాయని వివరించారు. అంతేకాకుండా విద్యుత్ రెవిన్యూ కూడా గణనీయంగా తగ్గిపోతుందని వివరించారు. విసిబిల సరఫరా తర్వాత అందించే సేవల్లో లోపం కారణంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో విసిబిల సరఫరా కోసం స్టైల్మెక్ లిమిటెడ్/ముంబయి, మెగాన్ స్విచ్గార్ ప్రై.లి. సేలం సంస్థలు దాఖలు చేసిన టెండర్లను పరిగణలోనికి తీసుకుని, వాటి ఫైనాన్స్ బిడ్లను తెరపడం జరిగిందన్నారు. స్టెల్మెక్ లిమిటెడ్/ముంబయి సంస్థ కోట్ చేసిన ధర (ఒక్కో విసిబికి) రూ. 5,84,636.36 పై॥లుగానూ, మెగావిన్ స్విచ్గేర్ ప్రై. లి./ సేలం సంస్థ (ఒక్కో విసిబిక్) రూ. 6,01,000.00 పై॥లకు ధరలను కోట్ చేశాయని పేర్కొన్నారు. అలాగే, ఈ సంస్థలు సమర్పించిన ధరలపై రివర్స్ టెండరింగ్ జరిగిందని, ఇంకనూ ధరలపై సంప్రదింపులు (నెగోషియేషన్స్) జరగలేదన్నారు. టెండర్ల ప్రక్రియలో భాగంగా అంతిమంగా ధరను నిర్ణయించే సంధర్భంలో సాంకేతిక ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటామని, నిర్ధిష్టమైన ధర ఖరారు కాకపోతే టెండర్లను రద్దు చేస్తామని తెలిపారు

గతంలో యేడాదికోసారి కోటా మేరకు వ్యవసాయ విద్యుత్ సర్వీసులను విడుదల చేసే పద్ధతి అమల్లో వుండేదన్నారు. అయితే ప్రస్తుతం రైతుల శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, విద్యుత్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిల నిర్ణయం మేరకు తక్షణమే సర్వీసులను విడుదల చేస్తున్నామని తెలిపారు. 2019 నుంచి 2023 వరకు (ప్రస్తుతం వరకు) మొత్తం 2.34 లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులను విడుదల చేశామన్నారు. ప్రస్తుతం కేవలం 7,129 సర్వీసులు విడుదల మాత్రం పెండింగ్ వుందన్నారు.

రైతుల సమస్యలపై తక్షణం స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం(ఆర్డిఎస్ఎస్) కింద సంస్థ పరిధిలోని 3,900 ఫీడర్లను వేరు చేస్తున్నామన్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిరంతరాయంగా 3 ఫేజ్ విద్యుత్తును సరఫరా చేయడానికి అవకాశం వుంటుందన్నారు. ఆర్డీఎస్ఎస్ పథకం కింద చేపట్టే పనులకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం గ్రాంటును మంజూరు చేస్తుందని, మిగిలిన 40శాతం వ్యయాన్ని మాత్రమే సంస్థ భరించాల్సి వుంటుందని వివరించారు. ఈ పథకానికి సంబంధించిన పనులు 2026లోగా పూర్తి చేయాల్సి వుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement