Thursday, April 25, 2024

ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ ప్రగతి భవన్ లో 74వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గాంధీ, అంబేడ్కర్‌ చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ పరేడ్‌ గ్రౌండ్‌లో అమర జవాన్ల స్థూపం వద్ద నివాళులర్పించారు. భారతదేశాన్ని సర్వసత్తాక,సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకొంటూ మనకు మనం సగర్వంగా సమర్పించుకొన్న పవిత్ర రాజ్యాంగాన్ని ప్రతీ పౌరుడు క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి సూచించారు. భారత 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురసరించుకొని దేశ ప్రజలకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

అంతకుముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హాజరైన సీఎం కేసీఆర్.. పరేడ్ గ్రౌండ్ లోని వీరుల సైనిక స్మారకానికి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలోనే వీరుల సైనిక స్మారకం దగ్గర సర్వమత ప్రార్థనలు చేశారు. త్రివిధ దళ అధికారులు కూడా పరేడ్ గ్రౌండ్ లోని వీరుల సైనిక స్మారకానికి నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement