Tuesday, May 21, 2024

సీఎం కేసీఆర్ ఘన స్వాగతానికి భారీ ఏర్పాట్లు.. దారి పొడవునా హోర్డింగులు, సైన్ బోర్డులు

ముంబై పర్యటనకు వెళ్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలకేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. దారి దారి పొడవునా హోర్డింగులు , సైన్ బోర్డులతో ఘన స్వాగతం పలకనున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం ఉద్ధవ్ థాకరే ఇల్లు ” వర్ష ” వరకు అడుగడుగునా భారీ హోర్డింగులను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర సీఎం మీటింగ్ అనంతరం ఎన్సీపీ అధినేత శరత్ పవర్ నివాసానికి వెళ్లి ఆయనతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు.

కాగా, బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే క్రమంలో అనేక ప్రాంతీయపార్టీల సీఎంలతో కేసీఆర్ చర్చలు జరపబోతున్నారు. అందులో భాగంగానే.. ముంబైలో కీలక చర్చలు జరగబోతున్నాయి. శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement