Thursday, May 9, 2024

CM KCR: మాకు రాజకీయాలంటే టాస్క్.. తెలంగాణ భాష మాట్లాడితేనే సినిమా సక్సెస్

తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తనకు రాజకీయాలంటే టాస్క్ అని, పవిత్రమైన కర్తవ్యం అని అన్నారు. ఇప్పుడు తెలంగాణ భాష మాట్లాడితేనే సినిమా సక్సెస్ అవుతోందని తెలిపారు. తెలంగాణ భాష,సంస్కృతి, వైభవం అధికారికంగా జరుపుకుంటున్నామన్నారు. నీటి విషయంలో తెలంగాణ వాటా తెచ్చుకున్నామన్నారు. గతంలో తెలంగాణ భాష మాట్లాడితే జోకర్ గా చూపించే వారని అన్నారు. ఇప్పుడు తెలంగాణ భాష మాట్లాడితేనే హీరో సక్సెస్ అవుతున్నాడన్నారు. ఎన్నో పండుగలను అధికారికంగా జరుపుతున్నామని తెలిపారు. అలాగే నీళ్ల వాటాలోనూ కొట్లాడి సాధించుకున్నామని చెప్పారు. తెలంగాణలో పంటలు పండిస్తే కొనలేమని కేంద్రం చేతులెత్తేసిందన్నారు. తెలంగాణ రూపాయి తెలంగాణకే ఖర్చు అవుతోందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement