Thursday, April 25, 2024

ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు: చిరంజీవి

తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ‘బతుకమ్మ’ పండుగ రానే వచ్చింది. ప్రతి సంవత్సరలానే ఈసారి కూడా ఆడపడుచులు బతుకమ్మ సంబరాలకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. కాగా తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. తెలంగాణ ఆడపడుచు ‘బతుకమ్మ’ కు స్వాగతం అంటూ విష్ చేశారు చిరంజీవి. “ఆశ్వయుజ మాసంలో 9 రోజుల బొద్దెమ్మ తర్వాత వచ్చే తెలంగాణ ఆడపడుచు ‘ బతుకమ్మ’ కు స్వాగతం. 9 రోజుల పాటు సాయంత్రం కాగానే వివిధ పుష్పాలతో తీరుగా తీర్చిదిద్దే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం.ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

ఇక ఈ తొమ్మిది రోజులూ సాయంత్రం కాగానే అందమైన పూలతో తయారు చేసిన ‘బతుకమ్మ’ను మధ్యలో పెట్టి చుట్టూ చేరి మహిళలంతా ఆటపాటలతో సందడి చేస్తారు. 9 రోజులపాటు రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తూ రోజుకో పేరుతో బతుకమ్మను సెలెబ్రేట్ చేసుకుంటారు. అందులో ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ… ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది బతుకమ్మలన్నమాట.

Advertisement

తాజా వార్తలు

Advertisement