Wednesday, May 8, 2024

Mega Power Star: రామ్ చరణ్ బర్త్ డే.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తనకుంటు ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇండ్రస్టీలో మెగాపవర్ స్టార్ గా పేరు సంపాదించాడు. తండ్రి చిరంజీవికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్ చేశారు. చరణ్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పటం వింతంగా ఉందని చిరంజీవి అన్నారు.”రాంచరణ్ కి సోషల్ మీడియా ద్వారా Birthday Wishes చెప్పటం నాకు వింతగా అనిపిస్తుంది. అయితే ఈ occasion లో రామ్‌ చరణ్‌ పిక్ ఒకటి షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది. కొడుకుగా He makes me proud and he is my pride. #HBDRamcharan” అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు.

కాగా, ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తూనే తండ్రి చిరంజీవి కోసం నిర్మాతగాను మారాడు. ప్రస్తుతం తండ్రి చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాలో నటిస్తూ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement