Thursday, May 2, 2024

మిర్చి రైతులను ఆదుకుంటాం – వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

ప్రభ న్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : మిర్చి పంట రైతులను ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో అకాల వర్షంతో మిర్చి,పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని భూపాలపల్లి శాసన సభ సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి, వారి సతీమణివరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ,రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ,ఎంపీ లు దయాకర్, కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మా రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డిల బృందంతో పాటు గండ్ర దంపతులు కలిసి జయశంకర్ జిల్లా రేగొండ మండలం, చెన్నపూర్ గ్రామంలో అకాల వర్షం తో దెబ్బతిన్న మిర్చి, పత్తి పంటలను పరిశీలించి, రైతులకు జరిగిన నష్టాన్ని గుర్తించి ప్రభుత్వం ద్వారా అందాల్సిన నష్టపరిహారాన్ని అందజేస్తామని తెలిపారు. రైతులను ధైర్యంగా ఉండమని ప్రభుత్వం ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ,జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, జడ్పీ వైస్ చైర్పర్సన్, భూపాలపల్లి నియోజక వర్గ ప్రజా ప్రతినిధులు, నాయకు లు,కార్యకర్తలు,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement