Saturday, May 4, 2024

చల్లబడ్డ భాగ్యనగరం- హైదరాబాద్‌లో చిరు జల్లులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : చిరు జల్లులతో హైదరాబాద్‌ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండవేడిమితో తల్లడిల్లుతున్న భాగ్యనగరం ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. నాంపల్లి, కోఠి, సుల్తాన్‌బజార్‌, బషీర్‌బాగ్‌, హిమాయత్‌నగర్‌, నారాయణగూడ ప్రాంతాలతో పాటు సికింద్రాబాద్‌, చిలకలగూడ, పద్మారావునగర్‌, మారెడ్‌పల్లి, బేగంపేట, బోయిన్‌పల్లిలో చిరు జల్లులు పడ్డాయి. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement