Monday, April 29, 2024

వివాహేతర సంబంధాలు.. నిర్ధోశిగా ఫ్రూవ్​ చేసుకోవడానికి సొంత బిడ్డనే తగలెట్టిన తల్లి..

వివాహేతర సంబంధాలు ఆమెను చిత్రవధకు గురిచేశాయి. తొలినాళ్లలో అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాత సూటిపోటి మాటలు రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో ఓ రాజు రాత్రి బాగా తాగి ఇంటికొచ్చిన భర్త తనను అవమానించడం.. తన శీలాన్ని శంకించడంతో ఆ మహిళ సొంత బిడ్డపై కిరోసిన్​ పోసి తగలబెట్టింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

సొంత కూతురిని దహనం చేసిన 38 ఏళ్ల మహిళను తిరువొత్తియూర్‌లో చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. తన శీలాన్ని శంకించిన భర్తకు నిర్ధోషిత్వాన్ని తెలియజేసేందుకు తల్లి తన పదేళ్ల బాలికకు నిప్పంటించింది. కాగా, ఆ చిన్నారి 75% కాలిన గాయాలతో చికిత్స పొందుతూ నిన్న హాస్పిటల్​లో చనిపోయింది. ఈ ఘటనకు బాధ్యులైన జయలక్ష్మి, ఆమె భర్త పద్మనాభన్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

5వ తరగతి చదువుతున్న పవిత్ర తన తల్లి జయలక్ష్మి, సవతి తండ్రి పద్మనాభన్‌తో కలిసి ఉంటోంది. జయలక్ష్మికి 19 ఏళ్ల వయసులోనే పాల్వన్నన్‌తో మొదటి పెళ్లయింది.. వీరిద్దరికి నర్సింగ్ చదివే అమ్మాయి కూడా ఉంది. ఆమె ట్యూటికోరిన్‌లో అమ్మమ్మ వద్ద ఉంటోందని పోలీసులు తెలిపారు. కాగా, జయలక్ష్మి పాల్వన్నన్‌ను విడిచిపెట్టి అతని తమ్ముడు దురైరాజ్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఆ తర్వాత వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే జయలక్ష్మీ, దురైరాజ్​ తమిళనాడు నుంచి ముంబై వెళ్లారు. అక్కడ వీరికి పవిత్రకు పుట్టింది.

ఆ తర్వాత జయలక్ష్మి దురైరాజ్‌ని కూడా వదిలేసి చెన్నైకి తిరిగి వచ్చి తిరువొత్తియూర్‌లో స్థిరపడింది. అక్కడ ఆమెకు విడాకులు తీసుకున్న ట్యాంకర్ డ్రైవర్ పద్మనాభన్‌తో స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో వీళ్లు తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వారికి ఆరు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. కాగా.. పద్మనాభన్ తరచూ తాగి వచ్చి ఆమెతో గొడవ పడేవాడని, ఆమెకు ఇంకా వివాహేతర సంబంధాలున్నాయని విశ్వసనీయతను దెబ్బతీసినట్టు తెలుస్తోంది.

మొన్న రాత్రి కూడా వారిద్దరి మధ్య పెద్ద గొడవే అయ్యింది.  జయలక్ష్మి నిర్దోషి అయితే.. పవిత్రను నిప్పంటించకుండా వదిలేస్తానని, తన కుమార్తెను ఆమె తగులబెట్టాలని పద్మనాభన్ సవాలు చేసినట్టు ఇరుగుపొరుగు వారి ద్వారా తెలుస్తోంది. అయితే.. జయలక్ష్మీ తన స్టెప్​ బ్రదర్స్ తో కలిసి నిద్రిస్తున్న పవిత్ర గదిలోకి వెళ్లి ఆమెను బయటకు లాగి కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఆ మంటలు ఒళ్లంతా పాకడంతో బాలిక అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు ఇంటికి చేరుకుని మంటలను ఆర్పి హాస్పిటల్​కు తరలించారు..  ఆమె కాలిన గాయాలతో నిన్న చనిపోయింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement