Friday, March 29, 2024

కేంద్ర బ‌డ్జెట్ పై రాహుల్ గాంధీ విమ‌ర్శ‌నాస్త్రాలు – వేత‌న జీవుల‌కు శూన్య హ‌స్తాలు చూపించార‌ని ట్వీట్

వేత‌న జీవుల‌కు శూన్య హ‌స్తాలు చూపించార‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ మండ‌ప‌డ్డారు. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నాలుగ‌వ‌సారి బ‌డ్జెట్ ని ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బ‌డ్జెట్ పై ప‌లువురు మండిప‌డుతున్నారు. వేత‌న జీవుల‌కు సంబంధించి ఈ బ‌డ్జెట్ లో ఎలాంటి ఊర‌ట‌నివ్వ‌లేదు. మధ్యతరగతి ప్రజలకు, బడుగు, బలహీన, పేదలకు, యువతకు, రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా మొండిచేయి చూపారని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మోడీ సర్కారు ‘జీరో’ సమ్ బడ్జెట్ ప్రకటించిందని అంటూ విమర్శించారు. వ్యక్తిగత ఆదాయపన్నుకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన తీసుకురాకపోగా, పన్నుశ్లాబుల్లోనే మార్పు లేదు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50 వేలుగానే కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బడ్జెట్ పై స్పందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement