Thursday, April 25, 2024

భార‌త్ రాష్ట్ర స‌మితిగా టీఆర్ ఎస్ పేరు మార్పు – సాయంత్రం కేసీఆర్ ప్రెస్ మీట్

టీఆర్ ఎస్ పేరు మారిపోయింది.ఇక‌పై బిఆర్ ఎస్ అంటే భార‌త్ రాష్ట్ర స‌మితి పార్టీగా ఆవిర్భ‌వించింది. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పేరుని ప్ర‌క‌టించారు.. మ‌ధ్యాహ్నం 1:19 గంట‌ల‌కు జాతీయ పార్టీ పేరును ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో వివిధ రాష్ట్రాల‌కు చెందిన నాయ‌కులు హైద‌రాబాద్ చేరుకుని కేసీఆర్‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్తున్న క్ర‌మంలో రాష్ట్ర‌వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సంబురాలు జ‌రిపారు. సాయంత్రం నాలుగు గంట‌ల‌కి సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్ట‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement