Friday, April 26, 2024

మూడు రోజులు కుప్పంలో ప‌ర్య‌టించనున్న చంద్ర‌బాబు – బాదుడే బాదుడు కార్య‌క్ర‌మానికి హాజ‌రు

బుధ‌వారం నుంచి మూడు రోజుల పాటు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టించ‌నున్నారు టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు. హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో బ‌య‌లుదేరిన ఆయ‌న కాసేప‌టి క్రితం బెంగ‌ళూరు చేరుకున్నారు. బెంగ‌ళూరు నుంచి రోడ్డు మార్గం మీదుగా ఆయ‌న కుప్పం చేరుకుంటారు. విద్యుత్ చార్జీల‌తో పాటు ఆర్టీసీ చార్జీల‌ను ..జ‌గ‌న్ స‌ర్కారు తీరును నిర‌సిస్తూ బాదుడే బాదుడు పేరిట టీడీపీ నిర‌స‌న‌ల‌ను కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. కుప్పంలో నిర్వహించ‌నున్న బాదుడే బాదుడు కార్య‌క్ర‌మంలో పాలుపంచుకునేందుకే చంద్ర‌బాబు కుప్పం ప‌ర్య‌ట‌న‌కు వెళుతున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కుప్పంతో పాటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని శాంతిపురం, గుడిప‌ల్లె మండ‌లాల్లోనూ చంద్ర‌బాబు ప‌ర్య‌టించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement