Friday, May 20, 2022

నంద్యాల బీజేపీ అధ్యక్షుడి హత్యకు కుట్ర జరుగుతోంది : సోము వీర్రాజు

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… నంద్యాల బీజేపీ అధ్యక్షుడి హత్యకు కుట్ర జరుగుతోందన్నారు. కాకినాడ ఎమ్మెల్యే జేఎన్టీయూలో మసీదు కట్టిస్తున్నాడన్నారు. రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. లవ్ జిహాద్ పేరుతో యువతులను మోసం చేస్తున్నారన్నారు. బీజేపీ పోరాటంతో ఆలయాలపై దాడులు తగ్గాయన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని చెప్పామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement