Sunday, April 28, 2024

Flash: ఖమ్మంలో చైన్నై షాపింగ్ మాల్ కు మంటలు..

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం సిటీలో ఉన్న చెన్నై షాపింగ్ మాల్ భవనం పై భాగంలో బుధవారం రాత్రి మంటలు వచ్చాయి. కరెంటు తీగల కారణంగా షార్ట్ సర్క్యూట్ కావడంతో భవనంపై ఉన్న ఫ్లెక్సీ బోర్డు అంటుకొని మంట‌లు ఎగిసిపడ్డట్టు తెలుస్తోంది. వెంటనే చుట్టుపక్కల వారు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు, అగ్నిమాపక శాఖ వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంట‌నే మంటలను ఆర్పేశారు. మంటలు భవనంలోనికి వ్యాప్తి చెందక ముందే నివారించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇదే ప్రమాదం అర్ధ రాత్రిపూట జరిగినట్లయితే భారీ నష్టం వాటిల్లి ఉండేదని చాలామంది చ‌ర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement