Monday, April 29, 2024

కోవిడ్ బూస్టర్ డోస్.. కేంద్రంపై రాహుల్ ఏమన్నారంటే

దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసు అందించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కరోనా టీకా బూస్టర్ డోసు పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన సిఫార్సులను స్వీకరించిందని రాహుల్ గాంధీ అన్నారు. తన సూచనలను కేంద్రం ఆమోదించిందని తెలిపారు. బూస్టర్ డోసులు పంపిణీ చేసేందుకు ముందుకొచ్చిందని చెప్పారు. దేశం ప్రజలకు వ్యాక్సిన్, బూస్టర్ డోసు అందాలని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

కాగా, నిన్న దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. హెల్త్​కేర్, ఫ్రంట్ ​లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు అందించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. జనవరి 10 నుంచి ‘ప్రికాషన్ డోసు’ పేరుతో వీటిని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement