Tuesday, May 7, 2024

వచ్చే నాలుగు వారాలు కీలకం:కరోనా పై కేంద్రం హెచ్చరిక

కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంపై కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాబోయే నాలుగు వారాలు అత్యంత కీలకమని పేర్కొంది. కట్టడికి అత్యంత కీలకమని, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కిందటేడాది కంటే తీవ్రమైందని కేంద్రం హెచ్చరించింది. కరోనా మహమ్మరి తీవ్రంగా ఉంది. గతంలో కంటే వేగంగా వ్యాప్తిస్తోంది. అందుకే కేసులు కూడా పెరుగుతున్నాయి. కరోనా నిబంధనలు పాటించడంలో పెరిగిన నిర్లక్ష్యం ఈ పరిస్థితికి దారి తీసింది. వైరస్‌ మరింత విస్తరించేందుకు మనం ఇక ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. 

కరోనా వ్యాప్తిపై సెంట్రల్ హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్తో కలిసి నీతిఅయోగ్ సభ్యుడు, ప్రొఫెసర్ వినోద్ పాల్మీడియా ముందస్తు హెచ్చరికలు చేశారు. దేశంలో కరోనా తీవ్రత పెరుగుతోంది. పరిస్థితి మరింత దిగజారుతోంది. కిందటేడాది కంటే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. వచ్చే నాలుగు వారాలు దేశానికి అత్యంత కీలకం. అర్హులైన వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి. దేశంలో సేఫ్ వ్యాక్సిన్లకు ఏ లోటు లేదు. ఇప్పటికైనా ప్రజలు పరిస్థితిని సీరియస్గా తీసుకొని మాస్క్లమాస్క్ లు ధరించాలి. పబ్లిక్ ప్లేస్ లో ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి’అని పాల్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement